గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు
మెగాస్టార్ చిరంజీవి- సురేఖ దంపతులకు 1987 మార్చి 27 న రామ్ చరణ్ జన్మించాడు
చిన్నతనం నుంచే చిరు, చరణ్ ను సినిమాలకు దగ్గరగా పెంచాడు
మెగాస్టార్ వారసత్వం పుణికిపుచ్చుకుని చరణ్ చిన్నతనం నుంచే ఆయన అడుగుజాడల్లో పెరుగుతూ వచ్చాడు
చిరుత సినిమాతో రామ్ చరణ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు
మగధీర తో మొట్టమొదటి రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిన టాలీవుడ్ హీరో రామ్ చరణ్
విజయాపజయాలను, ట్రోల్స్ ను తట్టుకొని మళ్లీ ధృవ తో విజయకేతనం ఎగురవేశాడు చరణ్
ఇక రంగస్థలం సినిమాతో తనలోని నటనను మెరుగుపర్చుకొని ట్రోలర్స్ సైతం సలామ్ కొట్టేలా చేశాడు మెగా హీరో
2012 లో ఉపాసన కామినేనిని ప్రేమించి పెళ్లాడాడు రామ్ చరణ్
ఆర్ఆర్ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా మారాడు
పాన్ ఇండియా రేంజ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని గ్లోబల్ స్టార్ గా కొనసాగుతున్నాడు
దాదాపు పదేళ్ల తరువాత రామ్ చరణ్- ఉపాసన క్లిన్ కారాకు జన్మనిచ్చారు
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న చరణ్.. నేడు 39 వ పడిలోకి అడుగుపెడుతున్నాడు.. ముందు ముందు ఈ గ్లోబల్ స్టార్ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిస్తూ .. హ్యాపీ బర్త్ డే గ్లోబల్ స్టార్