ఉదయాన్నే నానబెట్టిన వేరుశనగలు తింటే ఎన్ని లాభాలో తెలుసా?

వేరు శెనగ సామాన్యుడు జీడిపప్పు అంటారు. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి.

వేరుశెనగలో ఫాస్పరస్, ప్రొటీన్లు, లిపిడ్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి.

నానబెట్టిన వేరుశెనగలను తింటే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.

చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో సహాయపడుతుంది.

వీటిలో యాంటీ ఆక్సీడెంట్లు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. ఖాళీ కడుపుతో తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.

గ్యాస్, అజీర్ణం, మలబద్దకం, అసిడిటీ వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.

వేరు శెనగలను ప్రతిరోజు ఉదయం తింటే రక్తప్రసరణ మెరుగుపడుతుంది.

వేరుశెనగలో పుష్కలంగా ఉండే కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, కంటి చూపును మెరుగుపరుస్తాయి.

వేరు శెనగలను తినడం వల్లన ఎముకలు దృఢంగా తయారవుతాయి.