మీరు అటు వైపు తిరిగి పడుకుంటున్నారా? ఈ సమస్యలు తప్పవు
మీరు రోజూ ఎటువైపు తిరిగి నిద్రపోతున్నారు? ఎడమ వైపుకా? కుడి వైపుకా?
మీరు ఎడమ వైపునకు తిరిగి పడుకుంటే సమస్య లేదు. కానీ, కుడివైపు తిరిగి నిద్రపోతేనే ఆలోచించాలి.
మన శరీరంలో ఉండే ‘తోరాకిక్ డక్ట్’ అనే ముఖ్య భాగం.. వ్యర్థాలను బయటకు పంపుతుంది.
లెఫ్ట్ సైడ్‌కు తిరిగి పడుకుంటే.. శరీరంలో ఉండే అన్ని రకాల వ్యర్థాలు, విషతుల్యాలు బయటికి పోతాయి.
లింఫ్ వ్యవస్థలోని అది పెద్ద ఆర్గాన్ ‘స్ల్పీన్’ కూడా శరీరంలో ఎడమ వైపే ఉంటుందట.
ఎడమ వైపు తిరిగి పడుకొనేవారిలో ఆ అవయవం చురుగ్గా పనిచేస్తుంది. రక్త సరఫరా బాగుంటుంది.
ఒక వేళ మీకు గుండెల్లో గానీ మంటగా ఉంటున్నట్లయితే ఎడమవైపు తిరిగి నిద్రపోండి.
మన బాడీలో లివర్(కాలేయం) కుడి వైపు ఉంటుంది. కాబట్టి అటు తిరిగి పడుకుంటే లివర్‌పై భారం పడుతుంది.
రైట్ సైడ్ తిరిగి పడుకుంటే కాలేయంలోని వ్యర్థాలన్నీ పేరుకుపోతాయి. భవిష్యత్తులో అది పెద్ద సమస్యగా మారుతుంది.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.