ఇయర్‌బడ్స్ పెట్టుకుంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి.
ఈ గాడ్జెట్ ప్రపంచంలో వస్తువులను వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇయర్ బడ్స్ పెట్టుకున్నప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి.
ఫోన్ లో ఛార్జింగ్ తక్కువ ఉన్నప్పుడు ఇయర్ బడ్స్ చెవిలో పెట్టుకోకూడదు. ఇది చాలా డేంజర్.
చాలా మంది పాటలు కానీ, వీడియోలను ఎక్కువ వాల్యూమ్ పెట్టి వింటారు. ఇలా చేయడం ద్వారా తొందరగా చెవుడు వచ్చే ప్రమాదం ఉంది.
ఎక్కువ సేపు బ్లూటూత్ చెవిలో పెట్టుకోవడం వల్ల కర్ణములోని నాళంలో తేమ పెరగి క్రమంగా అక్కడ బాక్టీరియా, వైరస్లు అభివృద్ది చెందుతాయి.
ఇయర్ బడ్స్ ఇప్పుడు చాలా తక్కువ రేటుకే వస్తున్నాయి. కానీ అది మీ చెవులను దెబ్బతీసే డెసిబుల్స్ కలిగి ఉంటాయి.
మెరుగైన,నాణ్యమైన బ్లూటూత్‌ని ఉపయోగించండి. తెలిసిన కంపెనీల ఇయర్ బడ్స్ని కొనడం ఉత్తమం.
ఇటీవల ఓ మహిళ చెవిలో ఇయర్ బడ్స్ పేలి శాశ్వతంగా వినికిడి కోల్పోయిన సంగతీ తెలిసిందే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
ఇయర్ బడ్స్‌ను సాధ్యమైనంతవరకు ఇతరులకు ఇవ్వకండి. ఎందుకంటే మనం వాడే ఇయర్ ఫోన్ల నుంచి వైరస్ ఇతరులకు సోకే ప్రమాదం ఉంది.