దానిమ్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండు. దానిమ్మలో ఉండే పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
దానిమ్మ తినడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ గణనీయంగా పెరుగుతుంది.
రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు క్రమం తప్పకుండా దానిమ్మపండును తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
దానిమ్మలో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి.
దానిమ్మలో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, రక్తపోటును అదుపులో ఉంచుతాయి.
శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో దానిమ్మ చాలా ఉపయోగపడుతుంది.
దానిమ్మలో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి.
తరుచుగా దానిమ్మ తినడం వల్ల క్యాన్సర్ వ్యాధి గ్రస్తులకు కూడా చాలా మేలు కలుగుతుంది.
దానిమ్మలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.