నేటి కాలంలో థైరాయిడ్ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.

మారుతున్న జీవనశైలి, క్రమ రహిత ఆహారపు అలవాట్లు, ఒత్తిడి థైరాయిడ్‌ ప్రధాన కారణాలలో ఒకటి.

థైరాయిడ్ వల్ల బరువు పెరగడం లేదా తగ్గడం, అలసట, ఇతర హార్మోన్ల అసమతుల్యత వంటి అనేక సమస్యలు వస్తాయి.

థైరాయిడ్‌కు అనేక రకాల మందులు అందుబాటులో ఉన్నప్పటికీ, హోం రెమెడీస్ చాలా బాగా ఉపయోగపడతాయి.

తులసి రసం: తులసి ఆకుల రసం తాగడం వల్ల థైరాయిడ్‌ బ్యాలెన్స్ అవుతుంది.

ప్రతి రోజు ఉదయం, గ్లాస్ నీటిలో గుప్పెడు తాజా తులసి ఆకుల రసం తీసి వేయాలి. అందులోనే  ఒక చెంచా తేనెను వేసి కలిపి త్రాగాలి.

ఇది థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రిస్తుంది. అంతే కాకుండా అలసట నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.

పుదీనా ఆకులు రసం : పుదీనా కూడా థైరాయిడ్‌ను సమతుల్యం చేయడంలో సహాయపడే శక్తివంతమైన ఔషధ మొక్క.

 పుదీనా ఆకుల రసం జీవక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది.

దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల థైరాయిడ్ వల్ల వచ్చే సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.