కారణం లేని కోపం, గౌరవం లేని ప్రేమ, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం - తీన్‌మార్

మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు - సన్నాఫ్ సత్యమూర్తి

యుద్ధంలో గెలవడం అంటే శత్రువును చంపడం కాదు, శత్రువుని ఓడించడం - జల్సా

గొప్ప గొప్ప యుద్ధాలన్నీ మన అనుకునే వారితోనే - అల వైకుంఠపురంలో

పాలు ఇచ్చి పెంచిన తల్లులు.. పాలించడం ఒక లెక్కా వీళ్లకి - అరవింద సమేత

లాజిక్‌లు ఎవరూ నమ్మరు, అందరికీ మ్యాజిక్‌లే కావాలి. అందుకే మన దేశంలో సైంటిస్ట్స్ కంటే బాబాలే ఫేమస్ - జులాయి

నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం - అతడు

అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు, జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు - ఖలేజా

బాగుండడం అంటే బాగా ఉండడం కాదు.. నలుగురితో ఉండడం, నవ్వుతూ ఉండడం - అత్తారింటికి దారేది

సంపాదించడం చేతకాని వాడికి ఖర్చుపెట్టే అర్హత లేదు - నువ్వే నువ్వే