డబ్‌స్మాషర్లుగా కెరీర్లు ప్రారంభించిన చాలామంది ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెనర్స్ అయిపోయారు. అందులో దీప్తి సునైనా ఒకరు.
తన మాజీ బాయ్‌ఫ్రెండ్ షణ్ముఖ్ జశ్వంత్‌తో కలిసి కవర్ సాంగ్స్ చేస్తూ ఫేమస్ అయ్యింది దీప్తి సునైనా.
ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా కూడా ఛాన్స్ కొట్టేసింది. ఆ హౌస్‌లో అందరూ తనను బనానా అని పిలిచేవారు.
బిగ్ బాస్ నుండి బయటికొచ్చిన తర్వాత దీప్తి రేంజే మారిపోయింది. స్టార్ హీరోయిన్లకు ధీటుగా మిలియన్స్‌లో ఫాలోవర్స్ సంపాదించుకుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో దీప్తి ఫోటోలు, వీడియోలు, రీల్స్‌కు లక్షల్లో లైకులు రావడం మొదలయ్యింది.
షణ్ముఖ్ జశ్వంత్‌తో బ్రేకప్ అనేది దీప్తికి చాలా కలిసొచ్చింది. సోషల్ మీడియా ద్వారా తనకు బ్రేకప్ చెప్పింది ఈ ముద్దుగుమ్మ.
బ్రేకప్ తర్వాత సోషల్ మీడియాలో దీప్తి సునైనా ఫాలోయింగ్ పెరిగిపోయింది. దాంతో పాటు తన గ్లామర్ షో కూడా పెరిగింది.
ఇప్పుడు ఎక్కువగా వెకేషన్స్‌కు, బీచ్‌లకు వెళ్తూ ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్‌తో పంచుకుంటోంది దీప్తి.
తాజాగా బీచ్‌లో పరుగులు తీస్తూ ఆ వీడియోను అప్లోడ్ చేసింది. దీంతో ఆ పరుగులేంటి అంటూ దీప్తిని ట్రోల్ చేస్తున్నారు.
మొత్తానికి ప్రస్తుతం ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కేటగిరిలో దీప్తి సునైనా స్టార్ అయిపోయింది.