2023లో అత్యధిక సంపాదన ఉన్న హీరోలు వీరే

ఫోర్బ్స్ పత్రిక 2023 సంవత్సరానికి గాను అత్యధిక పారితోషకం తీసకున్న నటీనటుల జాబితా విడుదల చేసింది.

ఆ జాబితాలో నటుడు, కమెడియన్ ఆడమ్ సాండ్లర్ టాప్ స్పాట్ లో ఉన్నాడు. గత ఏడాది అతని సంపాదన 73 మిలియన్ డాలర్లు.

ఐకానిక్ బార్బీ పాత్ర పోషించిన నటి మార్గరెట్ రాబీ 59 మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉంది.

మిషన్ ఇంపాజిబుల్ హీరో టామ్ క్రూజ్ 45 మిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నాడు.

బార్బీ మూవీలో హీరో పాత్ర పోషించిన ర్యాన్ గోస్లింగ్ 43 మిలియన్ డాలర్ల ఆదాయం సంపాదించాడు.

సీనియర్ హీరో మ్యాట్ డేమన్ కూడా ర్యాన్ గోస్లింగ్ తో సమానంగా 4వ స్థానంలో ఉన్నాడు.

నటి జెన్నిఫర్ అనిస్టన్ 42 మిలియన్ డాలర్లతో 5వ స్థానంలో ఉంది.

6వ స్థానంలో 41 మిలియన్ డాలర్ల ఆదాయంతో టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో ఉన్నాడు.

యాక్షన్ హీరో జేసన్ స్టాథమ్ కూడా లియోనార్డోతో సమానంగా 6వ స్థానంలో ఉన్నాడు.