డ్రాగన్ ఫ్రూట్ మార్కెట్‌లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా దొరుకుతుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు.
ఈ పండు పోషకాల స్టోర్ హౌస్ అని చెప్పాలి. ఇందులో ఫైబర్, ప్రొటీన్లు అధికంగా ఉన్నాయి.
మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ వంటి మినరల్స్, ఖనిజాలు వీటిలో ఎక్కువగా ఉన్నాయి.
విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల.. మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
తరచూ మన డైట్‌లో డ్రాగన్ ఫ్రూట్ చేర్చుకుంటే.. అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయంటున్నారు నిపుణులు.
డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి
ఈ పండును డైలీ తింటే.. గుండె ఆరోగ్యం మెరగవుతుంది. అంతేకాకుండా మెదడు పనితీరు బాగుంటుంది.
ఈ సీజన్‌లో చాలా మంది దగ్గు, జలుబు సమస్యలతో బాధపడతారు. ఇలాంటి వారు డ్రాగన్ ఫ్రూట్‌కి దూరంగా ఉండాలి.