కుక్కర్ లో బిర్యానీ చేసేయండి ఇలా..

బిర్యానీ తినాలని ఉంది. కానీ త్వరగా వంట చేయాల్సినప్పుడు కుక్కర్‌ని ఉపయోగించండి.

కావాల్సినవి.. 500 గ్రాములు చికెన్, 2 కప్పులు బియ్యం, అరకప్పు పెరుగు, టమోటాలు, ఉల్లి, మిర్చి, అల్లం వెల్లులి పేస్ట్

కావాల్సినవి.. 2 టేబుల్‌స్పూన్లు బిర్యానీ మసాలా, పసుపు, చిల్లీ పౌడర్ , బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాయిచీ, నెయ్యి, కొత్తిమీర

స్టవ్ పై కుక్కర్ వేడెక్కిన తరువాత నెయ్యిలో బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాయిచీ వేయించుకోండి. ఆ తరువాత ఉల్లి ఎర్రగా వేయించుకోవాలి.

తరువాత చికెన్ తోపాటు అల్లం వెల్లులి పేస్ట్, పెరుగు, టమోటాలు, చిల్లీ పౌడర్, బిర్యానీ మసాలా, పసుపు వేసి 5 నిమిషాలు వదిలేయండి.

కుక్కర్ లో చికెన్‌లోకి నీటిలో కడగేసిన బియ్యం వేసి పై నుంచి కొత్తిమీర, ఉప్పు, నీరు వేసి కలపండి.

మీడియం ఫ్లేంలో ఒకటి లేదా రెండు విజిల్స్ కు హీట్ చేయండి.

అంతే మీ బిర్యానీ రెడీ. రాయితాతో పాటు ప్లేటులో వేసుకొని లాగించేయండి.