చాలా మందిలో రోటీ, లేదా అన్నం రెండింటిలో ఏది తింటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయనే విషయంపై సందేహాలు ఉంటాయి.
అన్నం తినడం వల్ల శరీరానికి కార్బోహైడ్రేట్లు అందుతాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అంతే కాకుండా అన్నం సులభంగా జీర్ణం అవుతుంది.
రోటీలు: వీటిలో ఫైబర్ పుష్కంగా ఉంటుంది. అందుకే రోటీలు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
రోటీలు తినడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన భావన ఉంటుంది.
ఒక బౌల్ రైస్ తింటే 200 కేలరీల శక్తి లభిస్తుంది. అదే ఒక రోటీ తింటే 70-80 కేలరీల శక్తి లభిస్తుంది.
బరువు తగ్గాలని అనుకునే వారు రోటీలను తినడం మంచిది.
అన్నం ఎక్కువగా తినడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. అందుకే ముధుమేహ వ్యాధిగ్రస్తులు రోటీలు తినడం మంచిది.
ఎక్కువ సేపు ఆహారం తిన్న భావన కలిగి ఉండాలంటే.. రోటీలను తినడం బెటర్. అన్నం తింటే త్వరగా ఆకలి వేస్తుంది.
అన్నం, రోటీలు రెండు ఆరోగ్యకరమైనవే. అవసరం, ఆరోగ్యానికి అనుగుణంగా వాటిని ఎంచుకోండి.