బలహీనమైన కంటి చూపు ఈ రోజుల్లో సాధారణ సమస్యగా మారింది.

ఫోన్, కంప్యూటర్ల వాడకంతో పాటు సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం కంటి సమస్యలకు కారణాలు.

క్యారెట్లు,చిలగడదుంపలు,బచ్చలికూర, గుమ్మడికాయ, ఇతర నారింజ కూరగాయలు విటమిన్ ఎకి మంచి వనరులు.

ఈ పదార్థాలు డైలీ మనం తినే ఆహారంలో తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. వీటిని తినడం వల్ల  కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

చేపలు, వాల్‌నట్‌లు,చియా గింజలు , అవిసె గింజలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి  చాలా మంచివి.

బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, ద్రాక్ష వంటి పండ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుండి కళ్ళను రక్షిస్తాయి.

ఆకుపచ్చని ఆకు కూరలు, గుడ్లలో లభించే ఈ పోషకాలు కంటిశుక్లంతో పాటు ఇతర సమస్యల నుండి రక్షించడంలో సహాయపడతాయి.

కంటి వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయండి. ఇలా చేయడం వల్ల కంటి సమస్యలు తగ్గుతాయి.