వాస్తు శాస్త్రంలో చెట్టు, మొక్కలను ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో వీటిని నాటడానికి కొన్ని వాస్తు టిప్స్ పాటించాలి.

 వాస్తు టిప్స్ పాటించి మనీ ప్లాంట్ మొక్కలను నాటితే ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. అంతే కాకుండా కుటుంబంలో ఆనందం పెరుగుతుంది.

మనీ ప్లాంట్ డబ్బును ఆకర్షిస్తుంది. ఇది ఇంట్లో సరైన దిశలో నాటితే అద్భుత ప్రయోజనాలు  ఉంటాయి.

 పొరపాటున కూడా మనీ ప్లాంట్ ఒక దిశలో నాటకూడదు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 ఇంటి ఈశాన్య దిశలో మనీ ప్లాంట్ నాటకూడదు. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు పెరుగుతాయి.

 ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ నాటాలి. ఈ దిశలో ప్లాంట్ నాటితే ఇంట్లో సానుకూలత పెరుగుతుంది.

మనీ ప్లాంట్ వాస్తుతో పాటు ఇతర విషయాలపై కూడా శ్రద్ధ తీసుకోవాలి. తద్వారా జీవితంలో ఆనందం పెరుగుతుంది.

మనీ ప్లాంట్ నేరుగా నేలపై నాటకండి. కుండీ లేదా సీసాలో ఈ మొక్కను నాటడం మంచిది.

ఈ మొక్క లక్ష్మీదేవికి సంబంధించింది కాబట్టి శుక్రవారం రోజున మనీ ప్లాంట్ నాటండి