జిమ్‌లో వ్యాయామం చేసే సమయంలో ఈ తప్పులు చేయకూడదు..

వార్మప్ చేయకపోతే.. వ్యాయామం చేసే సమయంలో ఒత్తిడిని కండరాలు భరించలేవు. గాయాలవుతాయి.

క్రమపద్దతిలో వ్యాయామం చేయాలి. ముందుగానే ఏ వ్యాయామం ఎంత సేపు చేయలానేది ప్లాన్ చేసుకోవాలి.

నీరు, లిక్విడ్స్ తప్పకుండా తీసుకోవాలి. వ్యాయామం మధ్య మధ్యలో నీరు లేదా లిక్విడ్స్ తీసుకుంటూ ఉండాలి.

కఠినమైన వ్యాయామం చేశాక పోషకాహారం తినకపోతే అనారోగ్యానికి గురవుతారు.

మీ శక్తికి మించిన బరువు ఎత్తకూడదు. దీనివల్ల తీవ్రంగా గాయపడడం.. మృత్యువు కూడా సంభవించే ప్రమాదం ఉంది.

వ్యాయామం చేశాక.. బాగా విశ్రాంతి తీసుకోవాలి. కండారాల పెరుగుదలకు ఇది చాలా అవసరం.