షుగర్ వ్యాధి నియంత్రణకు ఇవి తప్పనిసరిగా పాటించాలి
షుగర్ వ్యాధి నియంత్రించుకోవడానికి ప్రతిరోజు బ్లడ్ షుగర్ చెక్ చేసుకుంటూ ఉండాలి.
భోజనంలో ఫైబర్, ప్రొటీన్ ఎక్కువగా తినాలి. ఫ్యాట్, షుగర్, కార్బొహైడ్రేట్స్ తక్కువగా తినాలి.
నిత్యం వ్యాయామం చేస్తూ ఉండాలి. నిద్రపోయే ముందు చేయకూడదు.
షుగర్ వ్యాధి ఉన్నవారు తప్పనిసరిగా నిత్యం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి.
డాక్టర్ చెప్పిన సూచనలు తప్పకుండా పాటించాలి. సొంత వైద్యం మానుకోవాలి.
ఒత్తిడిగా ఉన్న సమయంలో కూడా ప్రశాంతంగా ఉండి సమాధానం కోసం వెతకాలి.
మద్యం, కెఫీన్ లాంటివి తాగకూడదు. అవి షుగర్ లెవెల్స్ అమాంతం పెంచేస్తాయి.