టాలీవుడ్‌లో చాలా తక్కువమంది మల్టీ టాలెంటెడ్ హీరోలు ఉన్నారు. అందులో అడవి శేష్ ఒకరు.
డిసెంబర్ 17న అడవి శేష్ పుట్టినరోజు కావడంతో తన ఫ్యాన్స్ అంతా బర్త్ డే విషెస్ చెప్తున్నారు.
అమెరికాలో పుట్టి పెరిగిన అడవి శేష్.. అక్కడ లైఫ్ వదిలేసుకొని సినిమాలో హీరో అవ్వాలనే కోరికతో ఇండియా వచ్చేశాడు.
మొదట్లో అడవి శేషే హీరోగా మాత్రమే కాకుండా డైరెక్టర్‌గా పలు సినిమాలు చేసినా వర్కవుట్ అవ్వలేదు.
హీరో అవ్వాలనే కోరికతో ఇండస్ట్రీలో అడుగుపెట్టినా హిట్స్ లేకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా నటించాడు.
2016లో విడుదలయిన ‘క్షణం’తో అడవి శేష్ కెరీర్ టర్న్ అయిపోయింది.
వరుసగా తక్కువ బడ్జెట్‌తో అదిరిపోయే థ్రిల్లర్స్ చేసి అందరినీ అలరించాడు. ముఖ్యంగా యూత్‌కు చాలా దగ్గరయ్యాడు.
తను నటించే సినిమాలకు తానే రైటర్‌గా పనిచేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు అడవి శేష్.
మినిమమ్ గ్యారెంటీ హీరోగా నిలదొక్కుకున్నాడు కాబట్టి రెమ్యునరేషన్ కూడా బాగానే తీసుకుంటున్నాడని సమాచారం.
ప్రస్తుతం ఒక్క సినిమాకు దాదాపు రూ.7 నుండి 10 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడట అడవి శేష్.