పరగడుపున బొప్పాయి తింటే.. ఎన్ని లాభాలో తెలుసా?

బొప్పాయి చర్మ సౌందర్యానికే కాదు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా పరగడుపున తింటే మరిన్ని లాభాలు ఉంటాయట.

బొప్పాయిలో ఉండే పపైన్ ఎంజైమ్ వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

బొప్పాయిలో విటమిన్ సి, యాంటీ ఆక్సీడెంట్లు వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపరుస్తుంది.

బొప్పాయిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.

బొప్పాయితో ఫేస్ ప్యాక్ ట్రై చేస్తే.. ముఖంపై మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి.

ప్రతిరోజు బొప్పాయి తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

పరగడుపున బొప్పాయి తినడం వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోయి కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది.