ముఖం అందంగా, మెరుస్తూ ఉండాలని అందరూ కోరుకుంటారు.  అందుకోసం కొంత మంది వివిధ రకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తారు.

ఇదిలా ఉంటే మరికొందరు మేకప్ వేసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ఇలా మేకప్ చేయడం వల్ల ఒక్కోసారి ముఖం బాగా డ్రైగా మారుతుంది.

డ్రై స్కిన్ సమస్యను తగ్గించే కొన్ని టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అధిక మేకప్ కారణంగా ముఖం చాలా పొడిగా మారుతుంది. పొడి చర్మం కోసం మంచి మాయిశ్చరైజర్ ఉపయోగించడం చాలా ముఖ్యం.

వేప, తులసిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి డ్రై , డల్ స్కిన్‌ను మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.

తేనె, పెరుగు మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి. ఇది చర్మానికి తేమను అందించి మృదువుగా చేస్తుంది.

రోజ్ వాటర్‌ను ముఖంపై స్ప్రే చేయడం వల్ల చర్మం చల్లబడి పొడిబారకుండా చేస్తుంది. ఇది మంచి నేచురల్ టోనర్.

తరుచుగా ముఖానికి తేనె వాడటం  వల్ల చలికాలంలో కూడా మీ చర్మం మెరుస్తుంది.