ప్రస్తుతం చాలా మంది జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.

జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉంటాయి.

మనం తీసుకునే ఆహారంతో పాటు జీవనశైలి, జన్యువులు కూడా జుట్టు రాలడానికి  కారణాలు

రోజుకు 100 వెంట్రుకలు రాలడం కామన్. కానీ ఎక్కువగా రాలితే మాత్రం జాగ్రత్తపడాలి.

జుట్టు రాలడాన్ని తగ్గించడానికి సరైన పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం.

జుట్టు రాలకుండా ఉండాలంటే కోడిగుడ్లను ఎక్కువగా తినాలి.

 కోడిగుడ్లలోని ప్రోటీన్, బయోటిన్‌లు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.

క్యారెట్, చిలగడదుంపలు తినడం వల్ల కూడా జుట్టు రాలడాన్ని నిరోధించవచ్చు.

పాలకూర కూడా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, ఐరన్, జింక్ జుట్టుకు పోషణను ఇస్తాయి.