సినీ పరిశ్రమలో సక్సెస్ ఎప్పుడు వస్తుందో చెప్పలేం. అలాగే తెలుగమ్మాయి వైష్ణవి చైతన్యకు ఆ సక్సెస్ లేట్‌గానే వచ్చింది.

1994 జనవరి 4న హైదరాబాద్‌లో పుట్టింది వైష్ణవి. ఒక షార్ట్ ఫిల్మ్ యాక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది.

ఎన్నో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌ల తర్వాత తనకు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించే ఛాన్స్ వచ్చింది.

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వెండితెరపై అడుగుపెట్టిన వైష్ణవి చైతన్య కెరీర్.. ‘బేబి’ సినిమాతో మలుపుతిరిగింది.

సాయి రాజేశ్ తెరకెక్కించిన ‘బేబి’లో స్టార్ యాక్టర్స్ లేరు, హై బడ్జెట్ కాదు.. అయినా బ్లాక్‌బస్టర్ దక్కించుకుంది.

2023లో ‘బేబి’ మూవీ రిలీజ్ అయ్యింది. అప్పుడు వైష్ణవి చైతన్యకు 30 ఏళ్లు.

పాతికేళ్లు దాటిన తర్వాత హీరో, హీరోయిన్‌గా సక్సెస్ దక్కడం కష్టమని అనుకునేవారికి వైష్ణవి ఇన్‌స్పిరేషన్.

‘బేబి’ తర్వాత వైష్ణవి చైతన్య లైఫ్ ఎక్కడికో వెళ్లిపోతుందని అనుకున్నారంతా.

కానీ ‘బేబి’ తర్వాత కేవలం ఒకేఒక్క సినిమాలో నటించింది వైష్ణవి చైతన్య.

ప్రస్తుతం వైష్ణవి చైతన్య అప్‌కమింగ్ సినిమాలపై ఎలాంటి క్లారిటీ లేదు.