మునగ అనేక ఔషధ గుణాలు కలిగిన మొక్క. ఆయుర్వేదం ప్రకారం ఈ చెట్టులోని అన్ని భాగాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

మునగకాయలు తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి.

మునగ కాయల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఖనిజాలు, విటమిన్లు కూడా ఉంటాయి.

డ్రమ్‌స్టిక్‌లో యాంటీఆక్సిడెంట్,యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి.ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

మునగలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

మునగలో పుష్కలంగా కాల్షియంతో పాటు ఫాస్పరస్ ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి.

మునగలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.