పెంపుడు పిల్లులకు ఈ ఆహారం ఇస్తే ప్రమాదం

పాలు పదార్థాలు.. పిల్లి ఎక్కువగా వీటిని తాగితే.. విరేచనాలు అవుతాయి.

చాక్లెట్.. ఇందులోని మిథైల్‌జాంథైన్స్ పిల్లులకు విషంతో సమానం. కుక్కలకు కాదు.

పచ్చి మాంసంలోని ఇ కోలి, సాల్మొనెల్లా బ్యాక్టీరియా పిల్లి ఆరోగ్యానికి హానికరం. మాంసం కాస్త ఉడికించి పెట్టాలి.

పెప్సీ, కోలా లాంటి డ్రింక్స్‌ తాగడం వల్ల అందులోని కెఫైన్‌ మిథైల్‌జాంథైన్స్ పిల్లికి జ్వరం, విరేచనాలు, వాంతులు వస్తాయి.

ద్రాక్ష తినడం వల్ల పిల్లికి కిడ్నీ సమస్యలు వస్తాయి. అందుకే ఏమాత్రం పెట్టకూడదు.

డాగ్ ఫుడ్.. కుక్కలు తినే ప్యాకెజ్ ఫుడ్ పిల్లులకు పెట్టకూడదు. వాటి ఆరోగ్యానికి ఇది సరిపడదు.

అల్లం వెల్లులి కలిగిన ఆహారం తింటే పిల్లికి రక్త హీనత వస్తుంది.