సౌత్‌లో ఉన్న మల్టీ టాలెంటెడ్ నటీమణుల్లో శృతి హాసన్ ఒకరు.
జనవరి 28న శృతి హాసన్ బర్త్ డే సందర్భంగా తన గురించి పలు ఆసక్తికర విషయాలపై ఓ లుక్కేయండి.
చిన్నప్పుడు తను కమల్ హాసన్ కూతురు అని తెలియకుండా ఉండడం కోసం పేరు మార్చుకుంది శృతి.
శృతి హాసన్ ఈజీగా 8 భాషల్లో మాట్లాడగలదు. అవే తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్, ఇటాలియన్, జెర్మన్, ఉర్దు.
శృతికి ‘ఎథోస్’ అనే సొంత రాక్ బ్యాండ్ ఉంది. దాని తరపున తను స్టేజ్ పర్ఫార్మెన్స్‌లు కూడా ఇస్తుంది.
‘శృతి హాసన్ ఫర్ షింగారా’ అనే క్లోతింగ్ బ్రాండ్ కూడా ప్రారంభించింది ఈ ముద్దుగుమ్మ.
శృతి కవితలు కూడా రాయగలదు. తను రాసిన ‘ది ఫోనిక్స్ పాల్మిరా’ అనే కవితల సమూహం పెద్ద హిట్.
శృతి హాసన్ ఒక సైకాలజీ స్టూడెంట్ అనే విషయం చాలామందికి తెలియదు.
హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి నటనతో పాటు పలు సినిమాల్లో పాటలు కూడా పాడింది.
శృతి హాసన్ ఫేవరెట్ కలర్ బ్లాక్. అందుకే తను ఎక్కడికి వెళ్లినా బ్లాక్‌లోనే కనిపిస్తుంది.