కడుపు ఉబ్బరానికి ఈ ఫుడ్స్ కారణం..

కడుపులో ఎక్కువగా గ్యాస్ ఉంటే దాన్ని ఉబ్బరం అని అంటారు.

లాక్టోస్ అలర్జీ ఉన్నవారు పాలు, పాల పదార్థాలకు దూరంగా ఉండాలి. వీటి వల్ల గ్యాస్ ఏర్పడుతుంది.

ప్రాసెస్డ్ ఫుడ్.. సోడియం ఎక్కువగా ఉండే బర్గర్లు, పిజ్జాలు తింటే శరీరంలో నీరు నిల్వ కావడంతో ఉబ్బరంగా ఉంటుంది.

కార్బోనేటెడ్ డ్రింక్స్‌లోని సోడా వల్ల కడుపు ఉబ్బరం అవుతుంది.

కొంతమందికి ఉల్లి, వెల్లులి తింటే గ్యాస్ ఏర్పడుతుంది. అందులోని ఫ్రక్టేన్స్ వల్లనే ఈ సమస్య వస్తుంది.

గోధుమ, మైదాలోని గ్లూటెన్ వల్ల గ్యాస్ సమస్య వస్తుంది. వీటిని తక్కువగా తినాలి.

బీర్ తాగడం వల్ల కూడా గ్యాస్. ఇందులోని కార్బొనేషన్, గ్రెయిన్స్, గ్లూటెన్ వల్లనే సమస్య.