జాబ్ ఇంటర్వూలో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యేది ఈ కారణాలతోనే..
ఆన్‌లైన్‌లో జాబ్ కోసం అప్లై చేస్తే రెజ్యూమ్ చాలా జాగ్రత్తగా రూపొందించాలి.
రెజ్యూమ్ లో కీవర్డ్స్ లేకపోతే అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టం దాన్ని రిజెక్ట్ చేస్తుంది.
స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా మీకు ఛాన్స్ ఉండదు. అందుకే రెజ్యూం ప్రూఫ్ రీడ్ చేసుకోవాలి.
రెజ్యూం సంక్షిప్తంగా ఉండాలి. మీ అచీవ్‌మెంట్స్‌ని బుల్లెట్ పాయింట్స్‌తో పెట్టండి. పారాలుగా వద్దు.
మీ స్కిల్స్, అనుభవం.. అప్లై చేసే జాబ్‌కు సంబంధించినవిగా ఉండాలి.
మీ గతంలో చేసిన ఉద్యోగాల మధ్య గ్యాప్‌లు ఎందుకున్నాయనే దానికి సమాధానం చెప్పలేకపోయినా సెలెక్ట్ చేయరు.
అందుకే అనారోగ్యమైనా లేక ఇతర కారణాలైనా ఉద్యోగాల మధ్య గ్యాప్ ఉంటే అందులో సర్టిఫికేషన్ ఉన్నట్లు చూపించుకోవాలి.
కొన్ని సార్లు ఇంటర్యూలో పరిస్థితులు మీ కంట్రోల్ లో లేకపోవచ్చు. కానీ మీరు మాత్రం అన్ని జాగ్రత్తలూ పాటించాలి.