ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఆదర్శవంతంగా ఉండటంతో పాటు తాము గర్వపడేలా చేయాలని  కోరుకుంటారు.

చిన్న తనం నుండే మంచి అలవాట్లు, జీవిత విలువలు నేర్పినప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది.

మీరు చిన్న నాటి నుండే  కొన్ని విషయాలను పిల్లలకు తప్పకుండా నేర్పించాలి.

పెద్దలను గౌరవించడం పిల్లలకు చిన్న నాటి నుండే నేర్పించాలి.

కూతుళ్లే కాదు, కొడుకులు కూడా ఇంటి పనుల్లో సహాయం చేయాలి.

అబద్ధాలు, మోసం విజయాన్ని తెచ్చిపెట్టలేవని మీ పిల్లలకు వివరించండి.

మీ కొడుకుకు చిన్నప్పటి నుండే అమ్మాయిలు, అబ్బాయిలు సమానమని వారిని గౌరవించడం ముఖ్యమని నేర్పండి.

గెలవడం ముఖ్యం, కానీ ఓటమిని విశాల హృదయంతో అంగీకరించడం కూడా ముఖ్యం అని నేర్పండి.