చిలకడదుంపతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు
చిలకడదుంప ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటిమిన్ బి6 అధికంగా ఉంటాయి.
చిలకడదుంపలో ఉండే బీటా కెరోటిన్ కంటి చూపును మెరుగుపరుస్తుంది
ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
ఇందులో యాంటీ ఆక్సీడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్ కారకాల నుండి రక్షిస్తాయి.
చర్మం మృదువుగా మెరిసిపోయేలా చేస్తుంది.
గొంతు, ఛాతి భాగాల్లో ఇన్పెక్షన్లను దూరం చేస్తాయి
మానసిక ఆందోళను తగ్గించడంలో తోడ్పడుతుంది.