నేటి బిజీ లైఫ్‌లో రాత్రి ఆలస్యంగా తినే అలవాటు చాలా మందిలో పెరిగింది
కానీ రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
అందుకే తిన్న తర్వాత కొద్దిసేపయినా నడవాలని డాక్టర్లు చెబుతుంటారు.
ముఖ్యంగా రాత్రి తిన్న తర్వాత అరగంట నడిస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయట.
అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడే వారు రాత్రి తిన్న తర్వాత నడిస్తే కేలరీలు బర్న్ అవుతాయి.
నడక వల్ల ఒత్తిడి తగ్గి మానసిన స్థితి మెరుగుపడుతుంది.
రాత్రి తిన్న తర్వాత నడవడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.
అంతే కాకుండా ప్రశాంతంగా నిద్ర పోవడానికి కూడా వాకింగ్ ఉపయోగపడుతుంది.
భోజనం తర్వాత నడిస్తే జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య తొలగిపోతుంది.