Fill in some text
తులసి మొక్కను దేవతా రూపంగా భావిస్తారు. ఆయుర్వేదంలో దీనిని మహాఔషధి అని అంటారు.
తులసి ఆకులను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
తులసి సాధారణ జలుబు నుండి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. అంతే కాకుండా గొంతు నొప్పిని తగ్గిస్తుంది
తులసి ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యమైన నూనెలు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.
తులసి ఆకులను క్రమం తప్పకుండా తీసుకుంటే, అవి శరీరం ఇన్ఫెక్షన్లు, వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి.
తులసి ఆకులు తినడం వల్ల జీర్ణ ఎంజైమ్‌ల స్రావం పెరుగుతుంది. ఫలితంగా జీర్ణ క్రియ వేగవంతం అవుతుంది.
తులసి ఆకుల్లోని లక్షణాలు ఉబ్బసం, దీర్ఘకాలిక శ్వాసకోశ సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తాయి.
తరచుగా వచ్చే ఎక్కిళ్ల సమస్య నుండి కూడా ఉపశమనం కలిగించడానికి తులసి ఆకులు ఉపయోగపడతాయి.