పల్లవి పాత్రకు కయాదు లోహర్ ఫస్ట్ ఆప్షన్ కాదు... సీక్రెట్ బయట పెట్టిన డైరెక్టర్

ప్రదీప్ రంగరాజన్ - కయాదు లోహర్ - అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన డ్రాగన్ సూపర్ హిట్ అవుతోంది.

ఇప్పటికే ఈ మూవీ 130 కోట్ల వరకు కలెక్ట్ చేసి రికార్డులు క్రియేట్ చేస్తుంది.

ఈ సినిమాలో పల్లవి పాత్రలో కనిపించిన కయాదు లోహర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

తెలుగులో గతంలో అల్లూరి సినిమా చేసినా... ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.

కానీ, డ్రాగన్ మూవీలో చేసిన పల్లవి పాత్రకు మంచి గుర్తింపు రావడమే కాదు... చేతి నిండా అవకాశాలను కూడా తెప్పిస్తుంది.

అయితే ఈ డ్రాగన్ సినిమా గురించి డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు సీక్రెట్స్ బయటపెట్టాడు.

ఈ డ్రాగన్ సినిమాలో అనుపమ చేసిన కీర్తి పాత్రకు కయాదు లోహర్‌ను తీసుకున్నారట.

సోషల్ మీడియాలో ఆమెపై ఉన్న క్రేజ్, ఆమెకు ఉన్న అందంతో కీర్తి పాత్ర కయాదుకే ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడట.

కానీ, అనూహ్యంగా కీర్తి పాత్రను అనుపమ పరమేశ్వరన్‌కు కేటాయించారట.

దీంతో తర్వాత లీడ్ రోల్‌గా ఉన్న పల్లవి పాత్రను కయాదు లోహర్ కు ఇచ్చారట.

ఈ పాత్ర చేసినా... కయాదు లోహర్ కెరీర్‌కు డ్రాగన్ మూవీ బాగానే హెల్ప్ అయిందని చెప్పొచ్చు.

ఇప్పటికే ఈమెకు తెలుగులో రవితేజ 76 మూవీలో ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. దీనితో పాటు మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ లేకపోలేదు.