మరో స్టార్‌ హీరోతో ఛాన్స్ కొట్టేసిన ప్రేమలు బ్యూటీ మమితా బైజు

ప్రేమలు మూవీతో ఒక్కసారిగా లైమ్ లైట్‌కి వచ్చేసింది మమితా బైజు.

ఈ మూవీకి ముందు ఈమె దాదాపు 15 సినిమాలు చేసింది. కానీ, ఏ ఒక్కటి కూడా నేమ్, ఫేమ్ తీసుకురాలేదు.

కానీ, ప్రేమలు మూవీ మమితా బైజుకు కెరీర్ టర్నింగ్ పాయింట్ అయింది.

ఈ మూవీ తర్వాత తమిళంలో 'రెబల్', తెలుగులో 'డియర్ కృష్ణ' సినిమాలు చేసినా... అవి పెద్దగా సక్సస్‌ను ఇవ్వలేవు.

యినా... మమితా బైజుకు ఆఫర్స్ రావడం మాత్రం తగ్గలేదు.

ఇటీవల రవితేజ 76 మూవీలో కాయదు లోహర్‌తో పాటు ఈమెకు కూడా ఛాన్స్ వచ్చినట్టు వార్తలు వచ్చాయి.

అలాగే ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మూవీలో కూడా మమితా ఆఫర్ కొట్టేసిందనే వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య మూవీ చేయబోతున్నాడు. దీన్ని సితారా ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మించబోతుంది.

ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ కోసం మమితా బైజును డైరెక్టర్ వెంకీ అట్లూరి సంప్రదించారట.

త్వరలోనే ఆమెకు స్టోరీ కూడా వినిపిస్తారట. స్టోరీ నచ్చితే... సూర్య - మమితా బైజు కాంబినేషన్ లో మూవీ రావడం ఖాయం. Images Credit: Pexels