కాఫీ స్ట్రెస్ దూరం చేయడమే కాదు.. అనేక రోగాల నుంచి కాపాడుతుంది.
మంచిదే కదా అని అదే పనిగా కాఫీ తాగుతూ కూర్చుంటే మాత్రం ప్రమాదమే.
కాఫీ ఎప్పుడూ మితంగానే తాగాలి. లేకుంటే కెఫిన్ ఇంటాక్సిఫికేషన్కు గురవ్వుతారు.
కెఫిన్ ఓవర్ డోస్ వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.
రోజుకు 400 mg మించి కాఫీ తాగకూడదని అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది.
రోజులో 1200 mg లేదా 12 కప్పుల కాఫీ తాగితే ప్రాణాలు పోతాయట.
కాఫీ అతిగా తాగితే మూత్ర సమస్యలు వస్తాయ్. పొటాషియం తదితర మినరల్స్ కోల్పోతారు.
పొటాషియం తగ్గితే కండరాలు దెబ్బతిని పక్షవాతానికి గురవ్వుతారు.
శ్వాస వ్యవస్థ కండరాలు బలహీనమైతే.. ఊపిరి పీల్చుకోడానికి ఇబ్బందిపడతారు.
కిడ్నీలు కూడా పనికిరాకుండా పోతాయి. దానివల్ల చనిపోయే ప్రమాదం ఉంది. Images Credit: Pixaby and Pexels
ఫాస్ట్ రీడింగ్ నేర్చుకోవాలంటే ఈ టిప్స్ పాటించండి