రంజాన్ మాసం ముగియగానే ముస్లింలు ఈద్ ఉల్ ఫితర్ అంటే రంజాన్ పండుగ జరుపుకుంటారు

ఈ పండుగకు ఒక రోజు ముందు సాయంత్రం నెలవంకను చూసి జరుపుకుంటారు.

నెలవంక మార్చి 30న కనిపిస్తే పండుగ 31న జరుపుకుంటారు లేదా ఇక ఏప్రిల్ 1న జరుపుకుంటారు.

పేదలు కూడా పండుగ జరుపుకునేందుకు ముందే ముస్లింలు జకాత్ పేరుతో భారీగా ధాన ధర్మాలు చేస్తారు.

అందుకే ఈ పండుగ రోజు పేద, ధనికులు అంతా సంతోషంగా సంబరాలు జరుపుకుంటారు.

ఈ నేపథ్యంలో  భారతదేశంలో ఘనంగా రంజాన్ పండుగ జరుపుకునే ప్రదేశాలు ఒకసారి చూద్దాం.

ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నో నగరం.. నవాబుల నగరం.. ఇక్కడ ఈద్ ఘనంగా జరుపుకుంటారు.

ఓల్డ్ ఢిల్లీలో భారీ సంఖ్యలో ముస్లింలు అక్కడి జామా మసీదులో ఈద్ ప్రార్థనలు జరుపుకుంటారు.

ఇక హైదరాబాద్ నగరంలో ఈద్ సంబరాలు ధూమ్ ధామ్ గా సాగుతాయి. ఇక్కడి వంటకాలు ఫేమస్.

ఇక ఈద్ సంబరాల సమయంలో ముంబై నగరం కాంతి వంతంగా ముస్తాబవుతుంది.

కోల్ కతా ముస్లింలు అక్కడి బెంగాలి సంస్కృతి ప్రకారంగా ఈద్ వేడుకలు నిర్వహిస్తారు.