టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 30న తన ఫ్యాన్స్ అంతా విషెస్ చెప్తున్నారు.
అంతే కాకుండా నితిన్ కెరీర్లో చేసిన హిట్స్, ఫ్లాప్స్ గురించి గుర్తుచేసుకుంటున్నారు.
2002లో తేజ దర్శకత్వంలో విడుదలయిన ‘జయం’తో హీరోగా పరిచయమయ్యాడు.
హీరోగా ఎంటర్ అయిన కొన్నేళ్లలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చూశాడు నితిన్.
ఆ తర్వాత నితిన్‌ను బ్యాడ్ లక్ వెంటాడింది. పైగా తన స్క్రిప్ట్ సెలక్షన్ ప్రేక్షకులకు నచ్చలేదు.
అలా కొన్నేళ్ల పాటు ఫ్లాప్స్ ఎదుర్కున్న తర్వాత ‘ఇష్క్’తో గ్రేట్ కమ్ బ్యాక్ ఇచ్చాడు నితిన్.
ఇప్పటికే నితిన్ కమ్ బ్యాక్ గురించి ప్రేక్షకులు మాత్రమే కాదు.. ఇండస్ట్రీ నిపుణులు కూడా మాట్లాడుకుంటారు.
నితిన్‌కు ఫ్లాప్స్ ఎదురవుతున్న సమయంలోనే తను హీరోగా ఒక హిందీ చిత్రంలో నటించాడు.
నితిన్ హీరోగా నటించిన ఒకేఒక్క హిందీ చిత్రం ‘అగ్యాత్’.
రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన ‘అగ్యాత్’ 2009లో విడుదలయ్యి యావరేజ్‌గా నిలిచింది.