ఈ లక్షణాలను తేలిగ్గా తీసుకోవద్దు.. టీబీ కావచ్చు

క్షయ వ్యాధి (టీబీ) వచ్చే ముందు మనలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

ఆ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే.. ఆస్పత్రిపాలవుతారు.

మూడు వారాలపాటు ఆగకుండా దగ్గు వస్తుంటే నిర్లక్ష్యం చేయొద్దు. అది టీబీ కావచ్చు.

రక్తంతో కూడిన కఫం వచ్చినా టీబీ కావచ్చు.

అకస్మాత్తుగా బరువు కోల్పోవడం, తరచుగా జ్వరం వంటివి టీబీ లక్షణాలు.

అస్సలు ఆకలి వేయకపోవడం, నీరసంగా, అలసట కూడా టీబీ లక్షణాలే.

రాత్రిపూట అతిగా చెమటలు పడుతున్నా.. అనుమానించాల్సిందే.

క్షయ అంటువ్యాధి.. రోగల నుంచి మనకు సోకకుండా మాస్క్ పెట్టుకోవడం ఉత్తమం.

Images Credit: Pixabay and Pexels