అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రపంచ దేశాలపై సుంకాల దాడి చేస్తున్నారు.

ఇతర దేశాల నుంచి అమెరికాలో దిగుమతి అయ్యే వస్తువులపై భారీగా పన్నులు వేస్తున్నారు.

సుంకాల ప్రభావం కారణంగా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.

దీంతో ప్రజలు నిత్యావసరాలు కూడా కొనలేని స్థితిలో ఉన్నారు.

కాఫీ, టీ, అరటి పండ్లు, అవకాడోస్ లాంటి ఆహార ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగిపోయాయి.

ఇక ఇంపోర్టెడ్ కార్లపై ట్రంప్ 25 శాతం సుంకాలు విధించి అందరికీ షాకిచ్చారు.

దీంతో ఇంపోర్టెడ్ వాహనాల ధరలు 2500 నుంచి 20000 డాలర్ల దాకా పెరిగిపోయాయి.

చైనాపై 34 శాతం సుంకాలు విధించడంతో ఫర్నిచర్ రేట్లు కొనలేనంతగా పెరిగాయి.

వైన్, మద్యంపై ట్రంప్ 200 శాతం సుంకాలు విధించడంతో మందుబాబులు దాహం తీర్చుకోలేకపోతున్నారు.

నిర్మాణ రంగంలో స్టీల్, అలూమినం ధరలు కూడా పెరిగిపోయి భవన నిర్మాణం కూడా భారంగా మారింది.

మరో వారం రోజుల్లో టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఇతర ఎలెక్ట్రానిక్స్ రేట్లు కూడా ఆకాశాన్నంటుతున్నాయి.