అతిగా ఆలోచిస్తున్నారా..? ఇలా చేయండి..

కొంత మంది ప్రతీ చిన్న విషయాన్ని పెద్దగా ఆలోచిస్తూ ఆందోళన పడుతుంటారు.

 ప్రతిరోజూ కొద్దసేపు ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

 మనస్సులో ఏదైనా భయాలు భాదలు ఉంటే ఇతరులతో పంచుకోవడం వల్ల  మనస్సు హాయిగా.. ప్రశాంతంగా ఉంటుంది.

 ఏదైనా పని చేసే సమయంలో పూర్తిగా దానిలోనే మునిగిపోయే అలవాటు పెంపొందించుకుంటే మనస్సు అదుపులో ఉంటుంది.

 కొత్త ప్రదేశాలు చూస్తే కొత్త అనుభూతులు కలుగుతాయి. అనవసర ఆలోచనల నుంచి కొంత రిలీఫ్ లభిస్తుంది.

చుట్టుపక్కల ఉన్న వారిలో ఎవరైనా ప్రతికూలంగా మాట్లాడితే లేదా నిరుత్సాహపరిచేలా ప్రవర్తిస్తే వారి నుంచి కొంత దూరం తీసుకోవడం మంచిది.

మనకు ఇష్టం ఉన్న హాబీ, సృజనాత్మక కార్యక్రమాలు, చేతిపనులు మొదలైనవి దృష్టిని ఆకర్షిస్తాయి. ఇలా చేయడం వల్ల ఆందోళనలు తగ్గుతాయి.

మనస్సులో ఉండే ఒత్తిడిని కొంత వరకు తగ్గించేందుకు ఆ ఆలోచనలను కాగితం మీద రాయడం మంచిది.

image credits..

Overthinking's