ఏప్రిల్ 9న జయా బచ్చన్ పుట్టినరోజు సందర్భంగా అమితాబ్‌తో తన లవ్ స్టోరీని గుర్తుచేసుకుంటున్నారు ఫ్యాన్స్.
1973లో అమితాబ్, జయా పెళ్లి చేసుకున్నారు. కానీ వీరిద్దరూ అసలు ఎలా కలుసుకున్నారో తెలుసా.?
1971లో విడుదలయిన ‘గుడ్డి’ అనే సినిమా వల్ల అమితాబ్, జయా మొదటిసారి కలుసుకున్నారు.
‘గుడ్డి’ సినిమాతోనే జయా బచ్చన్ హీరోయిన్గా తన కెరీర్‌ను ప్రారంభించింది.
ఆ సినిమా సెట్లో కలుసుకున్న ఇద్దరూ ప్రేమలో పడడానికి పెద్దగా సమయం పట్టలేదు.
‘గుడ్డి’ తర్వాత ‘ఏక్ నజర్’ అనే సినిమాలో కూడా అమితాబ్, జయ కలిసి నటించారు.
‘ఏక్ నజర్’లో నటిస్తున్న సమయంలోనే జయాతో ప్రేమలో పడిపోయాడట అమితాబ్.
తను ప్రేమించిన జయాతో కలిసి ట్రిప్స్‌కు వెళ్లాలనుకునేవాడట అమితాబ్ బచ్చన్.
అమితాబ్ తండ్రి మాత్రం జయాను పెళ్లి చేసుకుంటేనే ట్రిప్స్‌కు అనుమతి ఇస్తానని అన్నారట.
అలా 1973లో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ కపుల్‌గా వెలిగిపోతున్నారు.