మీ పిల్లలు ఫోన్ చూస్తున్నారా? అయితే డేంజర్ జోన్‌లో పడ్డట్టే..
పిల్లల ఇష్టానుసారంగా.. తల్లిదండ్రులు ప్రవర్తించిన ప్రతిసారీ అది మీ చిన్నారులకు హానీ చేస్తుంది.
పిల్లలు ఫోన్ చూడటం వల్ల చిన్న వయసులోనే కంటి చూపు మందగిస్తుంది.
ఎక్కువగా పిల్లలు తినేటప్పుడు ఫోన్ చూస్తుంటారు. దీని వల్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
ఫోన్ నుంచి వెలువడే కాంతి కళ్ళకు హాని కలిగిస్తుంది. దీని వల్ల కంటి చూపు మందగించడం, ఎర్రబడటం వంటి సమస్యలు వస్తాయి.
చిన్న వయసులో స్క్రీన్‌కు అలవాటైన వాళ్లకు మాత్రం మాటలు తొందరగా రావని వైద్య నిపుణులు తెలిపారు.
ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడిపితే ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు వస్తాయి.
ఫోన్‌కు బదులుగా పిల్లలను ఇతర కార్యకలాపాలలో పాల్గొనేలా ప్రోత్సహించాలి.
తల్లదండ్రులు కూడా ఫోన్‌లను తక్కువగా ఉపయోగించాలి.
Pic credits: Pixels and Pixabay