చియా సీడ్స్ ‌ని నానపెట్టకుండా తింటున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త..

చాలా మంది బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్‌లో కచ్చితంగా చియా సీడ్స్‌ తీసుకుంటారు

చియా సీడ్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి

డ్రై చియా సీడ్స్​ తిని, ఆ తర్వాత నీళ్లు తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు

ఎలాంటి సమస్యలు రాకూడదంటే చియా సీడ్స్‌​ని రాత్రంతా నానపెట్టిన తర్వాత తినాలి

దీనిలోని ఫైబర్ జీర్ణ క్రియకు సహాయపడినా.. ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది

చియా సీడ్స్‌లను తీసుకోవాలంటే నీటిని కూడా తగినంతగా తాగడం అవసరం

వీటిని సలాడ్‌లపై చల్లడం లేదా వేయించి తినడం వల్ల ఆహార నాళంలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది

దీనివల్ల ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, అన్నవాహిక సమస్యలు తలెత్తవచ్చు

అందుకే మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యుల సూచనలతో వీటిని తీసుకోవడం మంచిది