వేసవిలో కీరదోసతో ఎన్ని ప్రయోజనాలో..!

కీరదోసలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది నీరు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది.

కీరదోస వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.

కీరదోస జీర్ణక్రియను ప్రోత్సహించడంలో సహాయపడతాయి, శరీరానికి హైడ్రేషన్ అందిస్తాయి.

కీరదోస తినడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

కీరదోసలో 95% నీరు ఉంటుంది. ఇది వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో తోడ్పడుతుంది.

కీరదోసలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.

కీరదోసలో తక్కువ కేలరీలు, ఎక్కువ నీరు ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

కీరదోసను కళ్లపై ఉంచడం వల్ల కళ్ల మంటలు, ఎరుపులు తగ్గి  కాంతివంతంగా ఉంటాయి.

కీరదోస రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో తోడ్పడుతుంది.

కీరదోస రక్తపోటును తగ్గించడంలో చక్కగా పనిచేస్తుంది.