కొన్ని రకాలు ఫ్రూట్స్ ఖాళీ కడపున తింటే జీర్ణక్రియ వేగమవుతుంది, పోషక లాభాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

యాపిల్.. ఇందులో యాంటిఆక్సిడెంట్స్, ఫైబర్ ఎక్కువ. ఇది బ్లడ్ షుగర్ నియంత్రిస్తుంది, జీర్ణశక్తి పెంచుతుంది.

అరటిపండులో పొటాషియం స్థాయి ఎక్కువ. ఉదయాన్నే తింటే తక్షణ ఎనర్జీ లభిస్తుంది.

దానిమ్మపండు.. యాంటిఆక్సిడెంట్స్, ఫైబర్ ఉండడంతో జీర్ణశక్తి, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.

ఆరెంజ్.. విటమిన్ సి ఎక్కువ, శరీరంలో హైడ్రేషన్ పెంచి, డెజెస్టివ్ ఎన్‌జైమ్స్‌ని స్టిములేట్ చేస్తుంది

పైనాపిల్.. లో బ్రోమెలైన్ ఎన్‌జైమ్ ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచి శరీరంలో వాపుని తగ్గిస్తుంది.

జామపండు..ఇందులో విటమిన్ సి, ఫైబర్ కంటెంట్ బ్లడ్ షుగర్ ని నియంత్రిస్తాయి.

బొప్పాయి.. ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉండడంతో యాసిడిటీ, కడుపు ఉబ్బరం తగ్గించి జీర్ణశక్తి పెంచుతుంది.