నిగనిగలాడే వాటర్ యాపిల్స్ ఎప్పుడైనా తిన్నారా?

వాటర్ యాపిల్ పోషకాలు ఎక్కువగా ఉండే ఉష్ణ మండల పండు. దీనితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

దీనిలో విటమిన్స్, పొటాషియం, ఫైబర్, ఐరన్, కాల్షియం, యాసిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

దీని పేరులోనే ఉంది వాటర్ అని.. దీనిలో నీరు ఎక్కువగా ఉంటుంది. శరీరం హైడ్రేషన్‌కి సహాయపడుతుంది.

వాటర్ యాపిల్స్‌లో విటమిన్ సి, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉన్నాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

అలాగే అధిక రక్తపోటు సమస్యను కూడా నియంత్రిస్తుంది. తరచూ గుండెపోటుకు గురయ్యే ప్రమాదం నుంచి కాపాడుతుంది.

దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు దీనిని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది .

వాటర్ యాపిల్ చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది, విటమిన్ బి మెటబాలిజంను పెంపొందిస్తుంది.

 వాటర్ యాపిల్స్‌ని పచ్చిగా తినవచ్చు, జామ్, పానీయాలు లాగా కూడా ఉపయగించవచ్చు.