'లవంగం టీ' ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

జలుబు ,దగ్గు నుండి ఉపశమనాన్ని అందించడంలో లవంగం టీ తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

దీనిలో, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

లవంగం టీ నోటిలో బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గిస్తుంది, దీనివల్ల పళ్ళ యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది

లవంగం టీ లో ఉండే యూజినాల్ అనే పదార్థం శరీరంలో మంటను తగ్గిస్తుంది, ఆర్థరైటిస్ వంటి పరిస్థితుల లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

తలనొప్పి సమస్యతో బాధపడుతున్నప్పుడు ఈ టీ తాగితే తక్షణమే ఉపశమనం లభిస్తుంది.

ఇది గ్యాస్, తిమ్మిరిని తగ్గిస్తుంది, భోజనం తర్వాత జీర్ణ అసౌకర్యానికి ఇది సహజ నివారణగా మారుతుంది.

లవంగాలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరానికి హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి.

అలాగే ఈ టీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది, కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

దీనిలోని యాంటీఇన్ప్లమేటరీ లక్షణాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయి. శ్వాసను సులభతరం చేస్తాయి.