డయాబెటిస్‌కు శాశ్వతంగా గుడ్ బై చెప్పే ఆకుల ఇవే..

ఇన్సులిన్ ఆకులు.. ఇవి డయాబెటిస్ ఉన్న వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఈ ఆకులు తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇవి Hb1c స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

దీనిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.

అలాగే ఈ ఇన్సులిన్ ఆకులు రక్త కొవ్వు స్థాయిలను నిర్వహిస్తుంది.

ఈ ఆకులలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి, వాపును తగ్గించడానికి సహాయపడుతుంది.

దీనిలో కోరోసోలిక్ యాసిడ్ ఉంటుంది, ఇది పాంక్రియాస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది.

క్రమం తప్పకుండా వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుందని చెబుతున్నారు.

ఈ ఆకులను పొడి చేసుకుని రోజు ఒక టీ స్పూన్ తీసుకుంటే.. షుగర్ నియంత్రణలో ఉంటుందని స్పష్టం చేశారు.

మీరు ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతుంటే, ఇన్సులిన్ ఆకులను ఉపయోగించే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి.