జుట్టు మందంగా, మెరిసిపోయే విధంగా ఉండాలని అందరూ కోరుకుంటారు.

అందుకోసం మంచి షాంపూ వాడాలని అనుకుంటాం. అయితే నిజానికి మంచి పోషకాహారంతో జుట్టుకు బలం వస్తుంది.

జుట్టు మందంగా ఉండాలంటే అందుకోసం మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉండే ఆహారం కావాలి.

కోడి గుడ్డు.. తక్కువ ధరలో లభించే మంచి ప్రొటీన్ సోర్స్ ఇది. జుట్టు మంచి బలం చేకూరుస్తుంది.

స్పినాచ్.. ఐరన్ డెఫిన్సీ వల్ల జుట్టు రాలిపోతూ ఉంటుంది. అందుకే స్పినాచ్ తింటే జుట్టు పలుచబారి పోయే సమస్య ఉండదు.

డ్రై ఫ్రూట్ నట్స్.. బాదంపప్పు, వాల్ నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ లలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టుకు మంచి పోషణ అందిస్తుంది.

నిమ్మకాయ, ఆరెంజ్, బత్తాయి లాంటి పండ్లలోని విటమిన్ సి కొల్లెజెన్ ఉత్పత్తి చేస్తుంది. ఇది జుట్టుకు మంచి పోషకాహారం.

క్యారెట్.. ఇందులో విటమిన్ ఎ మెండుగా ఉంటుంది. దీని వల్ల జుట్టుకు కావాల్సిన సెబం ఆయిల్ ఉత్పత్తి అవుతుంది.