పాములకు చెవులు ఉంటాయా ? లేదా ? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.

పాములకు మనలాగా చెవులు లేదా చెవి రంధ్రాలు ఉండవు. అందుకే అవి గాలిలో ప్రయాణించే శబ్ద తరంగాలను నేరుగా వినలేవు.

చెవులకు బదులుగా అవి నేలపై వచ్చే ప్రకంపనలను చాలా సులభంగా గ్రహిస్తాయి.

పాములకు మన చెవులలో ఉండే మధ్య చెవి భాగం, లోపలి చెవి భాగం వంటివి మాత్రమే ఉంటాయి. లోపలి చెవి వాటి దవడ ఎముకలకు అనుసంధానమై ఉంటుంది.

వీటి ద్వారా నేలపై వచ్చే శబ్దాలు లేదా కదలికల వల్ల కలిగే ప్రకంపనలు మొదట పాము శరీరాన్ని తాకుతాయి

ఈ ప్రకంపనలు పాము శరీరం గుండా ప్రయాణించి.. దాని దవడ ఎముకల ద్వారా లోపలి చెవికి చేరుతాయి.

లోపలి చెవి.. ఈ ప్రకంపనలను మెదడుకు చేరవేస్తుంది. ఈ సంకేతాలను మెదడు విశ్లేషించి శబ్దాలుగా లేదా కదలికలుగా గుర్తిస్తుంది.

అందుకే.. పాములకు గాలిలో వచ్చే శబ్దాల కంటే, నేలపై వచ్చే అడుగుల చప్పుడు వంటి వాటిని చాలా స్పష్టంగా తెలుసుకుంటాయి.

 గాలిలో ప్రయాణించే శబ్ద తరంగాలను మన చెవులు గ్రహిస్తే.. పాములు నేల ద్వారా వచ్చే తరంగాలను గ్రహిస్తాయి.

ఇది వాటికి వేటాడే జంతువులు లేదా శత్రువులు తమ దగ్గరకు వస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి సహాయపడుతుంది.

ఇలా పాములు నేల ద్వారా వచ్చే ప్రకంపనలను గ్రహించి తమను తాము రక్షించుకుంటాయి.