బెల్లంతో బోలెడు లాభాలు
బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజు బెల్లం తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.
పాలల్లో బెల్లం కలిపి తాగితే ఎముకలు దృఢంగా మారతాయి.
బెల్లంలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇవి జీవక్రియను మెరుగుపరుస్తుంది.
రక్తహీనతను తగ్గించే ఐరన్ బెల్లంలో అధికంగా ఉంటుంది.
ఎర్రరక్త కణాలు సాధారణ స్థాయిలో ఉంటాయి. శరీరంలో శుద్ధి చేస్తుంది.
బెల్లం తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెంచుతుంది.
రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది.
కాలేయాన్ని శుద్ధి చేస్తుంది. విష పదార్ధాలను బయటకు పంపుతుంది.
ముఖంపై మచ్చలు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.
మహిళలు రోజూ కొద్దిగా బెల్లం తినడం వల్ల నెలసరి ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే.. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.