ఆప్రికాట్ ఫ్రూట్ లాభాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు
వీటిలో విటమిన్ ఎ, బీటా-కెరోటిన్, ఇతర యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి
వీటిలో ఉండే అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
వీటిలో ఉండే విటమిన్లు ఎ, సి చర్మాన్ని మెరుగ్గా కనిపించేలా చేయడంలో సహాయపడతాయి.
యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో.. సహాయపడతాయి.
ఆప్రికాట్ వాపును తగ్గించడంలో సహాయపడతాయి.
కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
వీటిలో ఉండే ఖనిజాలు, విటమిన్ల కారణంగా శరీరం శక్తిని పొందడంలో సహాయపడుతుంది.
ఆప్రికాట్లు వివిధ రకాల యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి.
ఆప్రికాట్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చక్కగా పనిచేస్తాయి.
ఆప్రికాట్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి అతిగా తీసుకుంటే ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తవచ్చు.